ఇలియానా పూర్వ గాధా లహరి: ఎవరే అతగాడు?
Note: This is meant only for fun. Nothing serious. Kindly take them with sportiveness.
Once upon a time there lived a princess called Iliyana (Ileana). ఇది తెలుగు బ్లాగు కనుక ఇక తెలుగులోనే ముందుకు పోదాం.
భవిష్యత్ లో అంటే భూంపుట్టక ముందు ఒకానొక దేశంలో ఇలియానా అనెడి ఒక కన్యోత్తమ కలదు. ఆమె తండ్రి ఒక రాజు కాన ఆమె ఒక రాకుమారి. As usually అందరు రాకుమార్తెలలాగా ఆమెకును ఏరకమైన వ్యాపకం లేనందున ప్రేమ యనెడి వ్యాపకమున బడెను.
ఆ విరహ తాపమున ఆమె విలపించుచుండగా ఆమె చెలికత్తె ఇట్లనెను.
"అమ్మడూ ఇలీ! నీవేదో కడు విషాదమునున్నట్లు తోచుచున్నది. కొంపదీసి ప్రేమలో గానీ పడితివా ఏమి నెచ్చెలీ," అని అడిగెను.
ఇలీ అన్న పిలుపు పిల్లీ లాగ తోచిన ఇలియానా అనెడి ఆ రాకుమార్తె మరింత భోరుమని విలపించగా..... ఆ చెలికత్తె ఇట్లనెను.
"అమ్మా! ఇలియానా దేవీ! నీ మనసునున్న యువకోత్తముండెవరో నాకు చెప్పిన నేను వాని పట్టితెత్తును కదా?"
ఆ విరహతాపమున నోట మాట రాని ఇలియానా అలా తన ట్రేడు మార్కైన వెర్రి చూపు చూచుచుండ... ఆ నెచ్చెలి ఇట్లనియె.
"ఎవరే అతగాడు? ముందుగ మన తెలుగు బ్లాగ్లోకమున వెదికెద సారీ చెప్పెద. వేణు గానమును వినిపించు బ్లాగరా? ఈ మధ్యనే కవిత్వం షురూజేసిన కత్తి మహేషా? హాస్య చక్రవర్తియైన విహారా? ఋష్యమూక పర్వతమున ఆ నలుగురికి దడచి దాగిన రవి గాంచలేని తేజో పరాక్రమశాలి ’రవి గారా’?" ఇట్లు చెప్పుకుని బోతుండగా... ఆ వాక్ప్రవాహానికడ్డుకట్టవేసిన ఇలియానా దేవి ఇట్లనియె.
"ఆఁ రవిగారా?" ఒక చిన్న నవ్వు నవ్వి, "గారెలు తిన్న కాస్త వళ్ళు వచ్చునని ఒక మహాముని నాకు నుడివెను. ఆ రవి గారెనెట్లైనను నాకు జేసి పెట్టమని చెప్పవే నెచ్చెలీ"
"హుష్! నా డవిలాగునకుయడ్డు ’రాకు’మారీ! నన్ను చెప్పనిమ్ము."
"అటులనేగానిమ్ము ప్రియమణీ!"
"పెళ్ళిగాని సీనునని ఎందరినో మభ్యపెట్టి ఈమధ్యనే వివాహమును జేసుకున్న ఒంగోలు సీను ఐన నేనేటియునూ జేయజాల. కెబ్లాస మూల పురుషుడు, మన రౌడన్నా? లేక పల్నాటి గాలినిదప్ప వేరు గాలినైనను సోకనివ్వని భాస్కరరామరాజా? హాహాహాసినియని బొమ్మరిల్లు స్పూఫు వేసిన నాగమురళియా? ఎవ్వరైనను జెప్పుము నేను దెత్తును నీకు, యొక్క ఈటీవీ సుమనును దప్ప."
"పాపం అతగానికేమియైనదే నెచ్చెలీ?"
"రచనా, దర్శకత్వం, మాటలూ, పాటలూ, బొమ్మలూ, దర్శకత్వ పర్యవేక్షణా, కథా, కథనం, పాడేదీ, రాసేదీ, ఆఖరుకు ఏసేదీ, చూసేదీ కూడా తానెయై ఉండు ఆతనిని నీవు వివాహమాడిన, నీకు వేసుకొనుటకు సున్నమైనను మిగల్చక ఊడగొట్టిపంపెదరే జనులు."
"మరి ధనరాజ్ మన్మధుడైన ఎట్లుండును?"
"బాగుండునుగానీ అతను ఆల్రెడీ బుక్డ్ కదా?"
"ఎంతీ!" అని తనదైన శైలిలో ఇలియానా ఆశ్చర్యపోయినది.
"నేను బుక్డ్ కాదు తల్లే. ఆ చీనీ పిల్ల అక్కదివరకే," అని నేను మందలించి నాకు జరగబోవు నష్టమును నివారించి కట్ చెప్పగా, రెండవ సన్నివేశమునకు రంగము సిద్ధమైనది.
***
అతగాడెవరో రేపు ఇలియానా నోటి వెంటే విందుము.
ఆమెన్! (ఆమెను కాదండీ. Amen)
14 comments:
LOL :))
ha haahahhaa
super
హ హ హ. సూపరో సూపరు. :)
"రచనా, దర్శకత్వం, మాటలూ, పాటలూ, బొమ్మలూ, దర్శకత్వ పర్యవేక్షణా, కథా, కథనం, పాడేదీ, రాసేదీ, ఆఖరుకు ఏసేదీ, చూసేదీ కూడా తానెయై ఉండు ఆతనిని నీవు వివాహమాడిన, నీకు వేసుకొనుటకు సున్నమైనను మిగల్చక ఊడగొట్టిపంపెదరే జనులు."
సూపరో సూపరు!!
ఇక చాలు చాలించండి. అతడెవరో నాకు తెలిసిపోయింది. :)
ఎవరండీ?
ధన,
ఆ చీనీ పిల్ల గురించి ఈ మధ్య బోలెడు కథలు వింటున్నా!ఏమి సంగతి!(మధ్యలో గీతాచార్య కేమీ తెలీదు, పాపం, తననేమీ అనకండీ)
hmmm
బ్లాగుల్లో పెళ్లి, ప్రేమ ముచ్చట్లు.. మధ్యలో ఈ చీనీ పిల్ల ఎందుకొచ్చింది..:(
పాపం ..:( సుమన్...
తర్వాతి భాగం తొందరగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా...
అంటే..షాంఘై లో నీకొచ్చిన జబ్బుకు కారణం చీనీ చిన్నదన్నమాట... మరి చెప్పలేదేంటి?
ఏదో బ్లాగుషిప్(బ్లాగు ఫ్రెండ్షిప్) కొద్దీ చెప్తున్నా చీనీ వాల్లతో జాగర్త తేడా వస్తే నిన్ను వండుకొని తినేసినా ఆశ్చర్యం లేదు.
మహాప్రభో... మధ్యలో ఈ Chinese Connection ఏమిటండీ? "ఇల్లు" చైనీస్ సంతతా ఏమిటి కొంపదీసి.
చీనీ పిల్ల గురించి రాత్రికే టపా.
@విష్వక్సేనుడు,
నాకా భయంలేదు. నేనలా మింగుడు పడే బాపతి కాదు. ఐనా ఏదన్నా తేడా వస్తే "జై మాస్టర్జీ"
@సుజాత గారు,
గీతాచార్యను నేను పొరబాటున కూడా అనను కానీ, బుజ్జి బాబుకి చాలానే తెలుసు. :-D
@ Minerva గారు,
మీకు తెలిసినదేదో నాకు చెప్పండి. లేందే మామిడి తాండ్ర చేత రెక్కీ చేయస్తాను. :-D
నేనయితే ఈ స్వయంవరం నుండి తప్పుకుంటున్నా. ధన, విజయీభవ. పెళ్ళి మునెమ్మ సినిమా తర్వాత పెట్టుకో మరి.
Post a Comment