తిండి తిప్పలు: బెక బెకల పక పకలు

The Man, The Manner, The Mannest...
You can fight against an enemy. But when you are up against a friend, who is very kind, helpful, and a pakkaa humanitarian, it's terrible.
మనని తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలనునే స్నేహితులు మనకొద్దు. మనని మనగా గౌరవించే వాళ్ళే మనకు ముద్దు. స్నేహానికి ప్రాతిపదిక స్వేచ్ఛ. స్నేహం కోసం నిన్ను నువ్వే త్యాగం... ఆ మాట కూడా తప్పు. కోల్పోవటం ఫూలిష్నెస్స్. కొందరు నిన్ను డిక్టేట్ చేయాలనుకుంటారు స్నేహం ముసుగులో. నిన్ను నువ్వు కోల్పోయిన తరువాత ఇక ఆ స్నేహితుడు తన రంగు బయట పెడతాడు.
అయినా ఎంత స్నేహమైనా తనకి చెప్పకుండా నిర్ణయం తీసుకోవద్దనే వాడు ఏమి స్నేహితుడు? నీదైన లోకాన్ని చిద్రం చేయాలనుకునే వాడు ఏమి మిత్రుడు?
నిన్ను అపరాధ భావం లో ముంచెత్తి, నీకూ నీ వాళ్ళకీ మధ్యన అగాధాన్ని సృష్టించేవాడు ఎ రకమైన మిత్రుడు? నిన్ను నీ వాళ్లకు కాకుండా చేసి తన మీద ఒక ఎమోషనల్ ప్యారసైట్ లాగ డిపెండ్ చేసుకుని నిన్ను చులకన కట్టే వాడు ఏమి స్నేహితుడు.
అందుకే "You may be wrong. You may be a fool. You may be a champion. But what always matter is You gotta be free."
మా నాన్నగారిని ఇలాగే చేసి ఆయన ఆత్మ హత్య చేసుకునే లాగా చేసిన ఆయన మిత్రుడు నాకు గుర్తొచ్చాడు. ఆ ఎమోషనే ఈ టపా.
స్నేహితులు లేకుండా ఒంటరిగానైనా ఉండొచ్చు కానీ, ఇలాగ నీఅస్తిత్వాన్ని కోల్పోవటం కన్నా ఆత్మ హత్య చేసుకోడమే మేలని మా నాన్న ఆత్మహత్య నోట్ లో రాశారు. ఇది జరిగి పదేళ్ళు అయింది.
అందుకే "నాదే ఈ ప్రపంచం." నేనే మహారాజుని. నన్ను గౌరవించని వారూనన్ను శత్రువు అనుకునే వారినీ నేను లెక్క చేయను. నీకు ఫ్రెండ్స్ లేరా? అనొచ్చు. నాకు నిజమైన స్నేహితులూ, ఒక గొప్ప గురువూ ఉన్నారు. ఆయినా అమ్ముంటే అంతకన్నా ఏం కావాలి?
ధనరాజ్ మన్మధ
నింగీ, నేలా, ఆకాశం..........................
......................................................
......................................................
......................................................
© Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008
Back to TOP