Wednesday, November 17, 2010

షాకింగ్ న్యూస్: అమెరికాలో ఆంధ్రుని అరెస్ట్!


అసలు నాకు పొద్దున పడుకుని రాత్రిళ్ళు మేలుకునే అలవాటు. ఇవాళ మాంఛి నిద్రలో ఉండగా ఇందాకన ఓ గంటన్నర క్రితం మా ఫ్రెండొకడు ఫోన్ చేశాడు. వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఒక భారతీయుడిని అరెస్ట్ చేసారంట. అతను చట్ట వ్యతిరేకంగా ఆయుధాలని కలిగి ఉన్నట్టు కంప్లెయింట్ రావటంతో, దాడి చేసి పట్టుకుంటే... పదుల సంఖ్యలో తుపాకులూ, ఇతర పదునైన మారణ సామాగ్రి, రక్తపు మరకలున్న ఒక వైర్ కూడా దొరికిందట. రెండు రోజుల క్రితం అక్రమ ఆయుధాలమ్మే చోట్ల అనుమానాస్పదంగా తిరుగుతుంటే సమాచారం అందించారంట  ఎవరో.  పోలీసు మామల అతిధి మర్యాదల తర్వాత తెలిసిందేమంటే అతను తెలుగువాడని.  వయసు సుమారు ముప్పై ఐదూ నలభై మధ్య ఉండొచ్చనీ,న్యూసు బయటకి పొక్కితే సంచలనమవుతుందనీ ఎక్కడా లీక్ కాకుండా చూసుకుంటున్నారనీ అన్నాడు. లోకల్ న్యూస్ పేపర్లలో దొరికిన ఫొటోని రాత్రి లోగా పంపుతానన్నాడు. వాడు ఇంకో మాట కూడా చెప్పాడు.ఆ వ్యక్తి నీకు బాగా తెలిసినవాడే అని. ఎవర్రా ?అంటే ఫోటో పంపుతా కదా చూసుకో అని ఫోన్ పెట్టేసాడు. దెబ్బకు నాకు మూడాఫై లేచి కూచున్నాను. అర్ధ పగలు పూట. హ్మ్!


ఎవరో ఆ దుర్మార్గుడు.. దేశద్రోహి?? వాళ్లింట్లో వాళ్లకు తెలుసో లేదో??

1 comments:

శ్రీనివాస్ November 17, 2010 3:32 AM  

ఈ రోజు జిమెయిల్ లో ఎవరు లాగిన్ అయ్యి లేరో చూస్తే సరి

About This Blog

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP