మార్తాండ చెప్పిన ఒకే ఒక అర్ధం అయ్యే మంచిమాట...
ఓ ప్లాలి నవతరంగంలో మన మామిడితాండ్ర గారు ఒకే ఒక్క పనికి వచ్చే మంచి మాట సెలవిచ్చారు. ఫాఫం. జనులందరు వారు సోఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ షలిస్టు ప్రవచనాలు వినలేక పోతున్నారు కదా... అందుకే ఇది కూడా just for change లాగా లాగి చూద్దామనీ,
>>>వీధులు ఊడ్చే మున్సిపల్ సిబ్బందికి చెత్తకుండీల్లో గుర్తు తెలీని పసిబిడ్డలు దొరుకుతుంటారు. అలా దొరికిన రోజున,ఆ మరుసటి రోజున దానిమీద చర్చ జరుగుతుంది. ఆ తర్వాత అంతా మామూలే.
*** *** ***
చెత్తకుండీలలో శిశువులు…!!!!???
ఇప్పటికీ ఇలాగే జరుగుతున్నది. కొన్నిసార్లు అది ఫాషన్ గా మారిపోవటమూ చూశాను. పాపం ఆ పిల్లలు ఏమి తప్పు చేశారని? కారణాలు ఏవైనా ఇది మాత్రం అత్యంత హేయమైన పని.
ఒకసరి నేను ఒక చెత్తకుండీలో ఒక శిశువుని కుక్కలు పీక్కుని తినటం చూసి కొంత మంది తొ కలసి వాటిని అదిలించాను. కానీ ఆ బిడ్డ బ్రతకలేదు. జీవితంలో తొలిసారి కంట నీరొలికింది.
ఇప్పటికీ ఆ దృశ్యం నా కళ్ళ ముందు మెదులుతూ నన్ను ఒకరకమైన సంఘర్షణలోకి నెడుతూనే ఉంటుంది.
ఆ పశి పిల్లలు ఏమి తప్పుచేశారని వాళ్ళకీ శిక్ష?
@గీతాచార్యా: తప్పు చేసింది ఆ శిశువులు కాదు. ఆ శిశువుల్ని “అక్రమం” అంటున్న సమాజం.
@గీతాచార్య గారు, కె.మహేష్ కుమార్ గారు.
ఇది మరీ బావు౦ది ! సమాజాన్ని ఎ౦దుక౦డీ ని౦దిస్తారు?! సమాజ౦ అ౦టేనే ఓ అయోమయ౦, రకరకాల క్రమాక్రమాలకు తార్కాణ౦!!
లోక౦ గురి౦చి తెలియకము౦దే, ఈ లోకాన్ని విడిచి వెళ్తున్న వాళ్ళు చాలా అదృష్టవ౦తులు!
కాని చెత్తకు౦డీల ను౦డి, పీక్కుతినే కుక్కల ను౦డి బయటపడి,
బతకడానికి మరో దారి లేక రాబ౦దులు కామా౦ధులై వె౦టపడి వేదిస్తు౦టే…..
వేగలేక, చావు రాక బితుకు బితుకు మ౦టూ బిచ్చగాళ్ళై వీధుల్ వెక్కిరిస్తున్నా లెక్కచేయక,
దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ…., వీళ్ళూ జీవిస్తున్నారా…..అనిపి౦చే మరో అనాథలు!
వారి కోస౦ మనమేమైన చేస్తున్నామా….అని అప్పుడప్పుడు గు౦డె తలుపులు తట్టి అడిగితే….,
నిఝ౦గా….లేదు అన్న సమాధాన౦ విన్న ప్రతిసారీ, ఆవేశ౦ కట్టలు తె౦చుకుని ఆలోచనాగ్నిని రగిలిస్తు౦ది,
అ౦తలోనే కుటు౦బ౦ బాధ్యతల రూప౦లో వర్షి౦చి దాన్ని ఆర్పేస్తు౦ది!!
ఇలా౦టివి ఇక్కడా (మన దేశ౦), అక్కడా (విదేశ౦), ఎక్కడ పడితే అక్కడ (ప్రతీ దేశ౦) ఎప్పుడూ జరిగేవే. జీవితమనే ర౦గుల ప్రప౦చ౦లో ఇదో పాలిపోయిన ర౦గు!!
కాబట్టి, ఇలా౦టి వాటి గురి౦చి ఎక్కువగా ఆలోచి౦చి….చి౦చి…చి౦చి, మనసు పాడుచేసుకోవద్దని నా అభిప్రాయ౦ (ఇలా అని మా బాబాయ్ చెప్పాడు).
@వారాల ఆన౦ద్ గారు,
సమీక్ష చాలా బావు౦ది, మళ్ళీ ఆలోచి౦పజేసి౦ది.
వీటికి సమాధానంగా మన తాండ్రగారు ఇచ్చిన రిప్లై ఇది.
సమాజం “అక్రమం” అనుకున్నంతమాత్రాన ఆ బిడ్డల్ని చంపెయ్యాలని రూలేమీ లేదు. ప్రపంచంలో ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు.