Monday, April 13, 2009

Plagiarism అప్పుడే మొదలైంది.


ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది అని ధంకా బజాయించి మరీ చెప్తుంటాం. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం (లిఖిత పూర్వక) అని జబ్బలు చరుస్తాం. కానీ తొడ గొట్టే బాలకృష్ణ డయలాగ్ మర్చి పోయినట్టు "వండుకున్నమ్మకి ఒక్కటే కూర..." సామెతని మాత్రం చాలా కంఫర్టబుల్ గా మర్చిపోతాం.
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం. అవును కానీ అందులో ఒక్కటంటే ఒక్క original అంశాన్ని చూద్దామంటే హైదరాబాద్ లో ఒయాసిస్ కోసం వెతికినట్టు అవుతుంది. అక్కడే మన పెద్దలు Plagiarism is our birth right అని చాటారు.
కొన్ని సూత్రాల్ని అమెరికా నుంచీ, మరి కొన్నింటిని జర్మనీ నుంచీ, ఇంకొన్నింటిని దక్షిణాఫ్రికా నుంచీ, ఆస్ట్రేలియా, ... వగైరహ్ లైన దేశోత్తమాల నుంచీ ఎత్తుకొచ్చి అలా మన ప్రజానీకానికి 'మన'వి చేసుకున్నారు.
అలా మన పెద్దలు మనవి చేసుకోవటం చూపగానే మన ప్రజానీకం నాయకుల ఆదర్శ బుడుంగు జాడలలో నడిచి ఆల్ మనవి చేసుకోవటాన్ని అలా అలా కొనసాగించారు.
అక్కడ మొదలైన plagiarism ఇప్పటికీ కొనసా............గి జనం లో ఇంకి, పెంకి, అన్నిటినీ శంకి మనలను డాంకీ, అలా అలా నడిచి పోతున్నది.
అంత పెద్ద భారత దేశమే మనవి చేసుకుంటుంటే చూస్తూ ఉన్న మనం ఎవరో పాపం బ్లాగుల్లో ఏదో పెట్టుకున్నారని దుమ్మెత్తి పోయటం ఏమి న్యాయం?

అంబేద్కర్ అమర్ రహే.


భీం రావ్ రాంజీ అంబేద్కర్. కొందరిలో విద్వేషం, మరికొందరిలో గౌరవ భావాన్నీ రగిల్చే వ్యక్తి. భారత దేశంలో అత్యున్నత నాయకుల్లో ఒకడిగా, నిమ్న కులాలని పైకి తీసుకుని రావాలనే ధ్యేయంతో జీవితకాల కృషిని చేసిన వ్యక్తిగా, ఉన్నత విద్యావంతునిగా, భారత దేశానికి రాజ్యాంగాన్ని సమకూర్చిన వ్యక్తిగా ఈయనను ఎవరూ మర్చిపోలేరు.


ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనని స్మరించుకుందాం.

కులం కుల:

"కులాలు నశించాలి!"


కుల రహిత సమాజం వర్ధిల్లాలి!


కులాల్ని నిర్మూలిస్తాం.


సామాజిక అసమానత్వాన్ని నిరశిస్తాం.


కానీ మా కులపోళ్ళకే ఎక్కువ సీట్లిస్తాం. "అరేయ్! మన కులపొడేరా! వదిలేద్దాం.


మనం దేన్ని వదిలేయాలో దాన్నే ఎక్కువ పట్టుకుని వేళాడుతాం. "అంటరానితనం అమానుషం." కానీ ఈ మటలని చిన్నప్పుడు బళ్ళో చెప్పిన అయ్యోరే తన ఇంటికి అంటరాని పిల్లలని రానీరు. రానిస్తే అంటు సోకుతుందని భయం.
మరి పాఠాలని ఎందుకు అలా చెప్తారు?ఈ దొంగ మాటలెందుకు?

సామాజిక న్యాయం = టిక్కెట్లమ్ముకోవటం.

అభివృద్ధి = అవినీతి లో దూసుకెళ్ళటం .

ఆత్మగౌరవం = కాలంలో వెనుకకి వెళ్ళటం.


ప్రత్యేక రాష్ట్రం = ఇది మా యాస అంటూ ప్రతీదానికీ బండబూతులు తిట్టటం.

ప్రజాపోరాటం = జనం వెనకుండి వారు పోరాడి దెబ్బలు తింటే మనం వారికోసం గొంతు విప్పి పాట పాడి నాట్యం చేయటం.

ఇన్ని చేసినా 'వాడు మన కులపోడురా!" ఇది మాత్రం మానం. మనం. మానం లేని మనం.

About This Blog

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP