Wednesday, November 17, 2010

ఎవరే అతగాడు? బ్రదర్ మలకుడు

నిన్న చెప్పానుగా అమెరికాలోఒక తెలుగువాడిని అరెస్ట్ చేసారు తుపాకులు, కత్తులు కొంటుంటే అని. అతను నాకు తెలిసిన వ్యక్తి అని నా ఫ్రెండ్ చెప్పినప్పటినుండి నిద్రపట్టడంలేదు. ఒకటే టెన్షన్ తో చచ్చిపోయానంటే నమ్మండి. ఇందాకే ఆ ఫోటోవచ్చింది.  అదే దుకాణంలో మెడలో రౌడీషీటర్ పలక వేసి తీసిన ఫోటో.. చూసి మీరే చెప్పండి.? ఇతను అంత దుర్మార్గుడా??


అసలు ఇష్యం ఏంటంటే... అన్న రెస్టు లేకుండా వర్కుతున్నాడని కాస్త అరెస్ట్ ఎక్కువైందని మా బాధ. కనీసం ఇయ్యాలన్నా రెస్టి పండగ చేస్కోవాల్న...

I WISH U A VERY HAPPY BIRTHDAY... BROTHER MALAK మLUCK

Read more...

షాకింగ్ న్యూస్: అమెరికాలో ఆంధ్రుని అరెస్ట్!


అసలు నాకు పొద్దున పడుకుని రాత్రిళ్ళు మేలుకునే అలవాటు. ఇవాళ మాంఛి నిద్రలో ఉండగా ఇందాకన ఓ గంటన్నర క్రితం మా ఫ్రెండొకడు ఫోన్ చేశాడు. వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఒక భారతీయుడిని అరెస్ట్ చేసారంట. అతను చట్ట వ్యతిరేకంగా ఆయుధాలని కలిగి ఉన్నట్టు కంప్లెయింట్ రావటంతో, దాడి చేసి పట్టుకుంటే... పదుల సంఖ్యలో తుపాకులూ, ఇతర పదునైన మారణ సామాగ్రి, రక్తపు మరకలున్న ఒక వైర్ కూడా దొరికిందట. రెండు రోజుల క్రితం అక్రమ ఆయుధాలమ్మే చోట్ల అనుమానాస్పదంగా తిరుగుతుంటే సమాచారం అందించారంట  ఎవరో.  పోలీసు మామల అతిధి మర్యాదల తర్వాత తెలిసిందేమంటే అతను తెలుగువాడని.  వయసు సుమారు ముప్పై ఐదూ నలభై మధ్య ఉండొచ్చనీ,న్యూసు బయటకి పొక్కితే సంచలనమవుతుందనీ ఎక్కడా లీక్ కాకుండా చూసుకుంటున్నారనీ అన్నాడు. లోకల్ న్యూస్ పేపర్లలో దొరికిన ఫొటోని రాత్రి లోగా పంపుతానన్నాడు. వాడు ఇంకో మాట కూడా చెప్పాడు.ఆ వ్యక్తి నీకు బాగా తెలిసినవాడే అని. ఎవర్రా ?అంటే ఫోటో పంపుతా కదా చూసుకో అని ఫోన్ పెట్టేసాడు. దెబ్బకు నాకు మూడాఫై లేచి కూచున్నాను. అర్ధ పగలు పూట. హ్మ్!


ఎవరో ఆ దుర్మార్గుడు.. దేశద్రోహి?? వాళ్లింట్లో వాళ్లకు తెలుసో లేదో??

Read more...

Sunday, August 8, 2010

హూయామై, నేనెవరు, మేఁ కౌన్ హూఁ, 我是誰



ఇందు మూలంగా యావన్మంది పెజెలకీ డప్పేస్కుంట్యమ్ ఏమనగా...

నా పేరు ధన్‍రాజ్ కాదు ధన్ ధన్ లాగా. ధనరాజ్ మన్మధ, షార్ట్లీ, ధనరాజ్, వెరీ షార్ట్లీ ధన

Yours Falsely

Read more...

Thursday, April 22, 2010

I AM ALIVE

I AM ALIVE.


HENCE NO PROBLEM


Read more...

Thursday, December 31, 2009

HAPPY BIRTHDAY MA'AM



You are the ideal match to the man I respect most.

HAPPY BIRTHDAY 2 U

Read more...

Tuesday, November 10, 2009

Harley Davidson ఇక నా సొంతం

Harley Davidson. అద్భుతమైన బైక్. రాజసం ఉట్టిపడే బైకది. దాన్ని కొనాలని ఎన్నాళ్ళుగానో ప్రయత్నం. మొత్తానికీ ఇవాళ మాస్టర్జీ ఆశీర్వాదంతో దాన్ని కొనేశాను. దాన్ని చూస్తుంటే మాస్టర్జీతో ఇంకో adventurous ride కి వెళ్ళాలని మనసువ్విళ్ళూరుతోంది. దీని మీద రైడింగ్ ఐపోయింది అప్పుడే. బ్రహ్మాండమైన అనుభవం.

Read more...

Saturday, July 18, 2009

మార్తాండ చెప్పిన ఒకే ఒక అర్ధం అయ్యే మంచిమాట...

ఓ ప్లాలి నవతరంగంలో మన మామిడితాండ్ర గారు ఒకే ఒక్క పనికి వచ్చే మంచి మాట సెలవిచ్చారు. ఫాఫం. జనులందరు వారు సోఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ షలిస్టు ప్రవచనాలు వినలేక పోతున్నారు కదా... అందుకే ఇది కూడా just for change లాగా లాగి చూద్దామనీ,


***

>>>వీధులు ఊడ్చే మున్సిపల్ సిబ్బందికి చెత్తకుండీల్లో గుర్తు తెలీని పసిబిడ్డలు దొరుకుతుంటారు. అలా దొరికిన రోజున,ఆ మరుసటి రోజున దానిమీద చర్చ జరుగుతుంది. ఆ తర్వాత అంతా మామూలే.
*** *** ***

చెత్తకుండీలలో శిశువులు…!!!!???

ఇప్పటికీ ఇలాగే జరుగుతున్నది. కొన్నిసార్లు అది ఫాషన్ గా మారిపోవటమూ చూశాను. పాపం ఆ పిల్లలు ఏమి తప్పు చేశారని? కారణాలు ఏవైనా ఇది మాత్రం అత్యంత హేయమైన పని.

ఒకసరి నేను ఒక చెత్తకుండీలో ఒక శిశువుని కుక్కలు పీక్కుని తినటం చూసి కొంత మంది తొ కలసి వాటిని అదిలించాను. కానీ ఆ బిడ్డ బ్రతకలేదు. జీవితంలో తొలిసారి కంట నీరొలికింది.

ఇప్పటికీ ఆ దృశ్యం నా కళ్ళ ముందు మెదులుతూ నన్ను ఒకరకమైన సంఘర్షణలోకి నెడుతూనే ఉంటుంది.

ఆ పశి పిల్లలు ఏమి తప్పుచేశారని వాళ్ళకీ శిక్ష?


@గీతాచార్యా: తప్పు చేసింది ఆ శిశువులు కాదు. ఆ శిశువుల్ని “అక్రమం” అంటున్న సమాజం.


@గీతాచార్య గారు, కె.మహేష్ కుమార్ గారు.
ఇది మరీ బావు౦ది ! సమాజాన్ని ఎ౦దుక౦డీ ని౦దిస్తారు?! సమాజ౦ అ౦టేనే ఓ అయోమయ౦, రకరకాల క్రమాక్రమాలకు తార్కాణ౦!!
లోక౦ గురి౦చి తెలియకము౦దే, ఈ లోకాన్ని విడిచి వెళ్తున్న వాళ్ళు చాలా అదృష్టవ౦తులు!
కాని చెత్తకు౦డీల ను౦డి, పీక్కుతినే కుక్కల ను౦డి బయటపడి,
బతకడానికి మరో దారి లేక రాబ౦దులు కామా౦ధులై వె౦టపడి వేదిస్తు౦టే…..
వేగలేక, చావు రాక బితుకు బితుకు మ౦టూ బిచ్చగాళ్ళై వీధుల్ వెక్కిరిస్తున్నా లెక్కచేయక,
దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ…., వీళ్ళూ జీవిస్తున్నారా…..అనిపి౦చే మరో అనాథలు!
వారి కోస౦ మనమేమైన చేస్తున్నామా….అని అప్పుడప్పుడు గు౦డె తలుపులు తట్టి అడిగితే….,
నిఝ౦గా….లేదు అన్న సమాధాన౦ విన్న ప్రతిసారీ, ఆవేశ౦ కట్టలు తె౦చుకుని ఆలోచనాగ్నిని రగిలిస్తు౦ది,
అ౦తలోనే కుటు౦బ౦ బాధ్యతల రూప౦లో వర్షి౦చి దాన్ని ఆర్పేస్తు౦ది!!
ఇలా౦టివి ఇక్కడా (మన దేశ౦), అక్కడా (విదేశ౦), ఎక్కడ పడితే అక్కడ (ప్రతీ దేశ౦) ఎప్పుడూ జరిగేవే. జీవితమనే ర౦గుల ప్రప౦చ౦లో ఇదో పాలిపోయిన ర౦గు!!
కాబట్టి, ఇలా౦టి వాటి గురి౦చి ఎక్కువగా ఆలోచి౦చి….చి౦చి…చి౦చి, మనసు పాడుచేసుకోవద్దని నా అభిప్రాయ౦ (ఇలా అని మా బాబాయ్ చెప్పాడు).
@వారాల ఆన౦ద్ గారు,
సమీక్ష చాలా బావు౦ది, మళ్ళీ ఆలోచి౦పజేసి౦ది.


వీటికి సమాధానంగా మన తాండ్రగారు ఇచ్చిన రిప్లై ఇది.


Marthanda says:

సమాజం “అక్రమం” అనుకున్నంతమాత్రాన ఆ బిడ్డల్ని చంపెయ్యాలని రూలేమీ లేదు. ప్రపంచంలో ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు.

దీని అసలు కథ తెలియాలంటే ఈ లింకుని సందర్శించండి. ఒక మంచి సినిమా గురించిన పరిచయమైనా దక్కుతుంది.

http://navatarangam.com/2009/04/chakra/

Note: ఇక్కడ చర్చ మార్తాండా ఇచ్చిన కాస్త అర్ధమయ్యే సమాధానం మీద కనుక వేరే ఇతర బ్లాగర్ల మీద మీరు వ్యాఖ్యానించకండి.

Read more...

Thursday, July 16, 2009

టీవీ69 బ్రేకింగ్ న్యూస్: సన్న్యాసుల ధర్నా...!!!

మా విలేఖరి మియా ద మాహెమ్ అందించిన సమాచారం ప్రకారం ఆంధ్ర దేశంలో ఉన్న పదకొండు లక్షలా రెండు వేలా డెబ్బైయ్యారు మంది సన్న్యాసులు అందరూ మూకుమ్మడిగా ధర్నా నిర్వహించారు.

అదేమని అడిగితే మా మనో భావాలు దెబ్బ తిన్నాయని వారి సమాధానం. కారణాలు తెలియ రాలేదు.

అభిఙ్ఞవర్గాల భోగట్టా ప్రకారం ఒక చీనీ పిల్లతో తిరిగే ఆంధ్రా యువకునికి ఈ విషయం వెనకాల ఉన్న కారణం అర్ధం అయిందని, అతనైతే మనకి బ్రేకింగ్ న్యూస్ బహుచక్కగా అందించగలడనీ విన్నాం. అందుకే అతనికోసం గాలింపు చర్యలు చేపట్టాం.
***

మార్తాండ వెంటనే ఒంగోలు శీను కి క్షమార్పణ చెప్పాలి.

జై అ ప్రే బ్లా వ్య స

Read more...

మార్తాండ దాష్టీకం - 2

విజయ మాధవ ని తన బ్లాగులో కామెంటకుండా అడ్డుకున్నందుకు... అతని ఐపీని బ్లాక్ చేసినందుకు.

ముందుగా మన జీడిపప్పు గారికి క్షమార్పణ చెప్పాలి. లేక పోతే మావో, స్టాలిన్లు సన్న్యాసం పుచ్చుకోవాలి.

Read more...

మార్తాండ దాష్టీకం

మార్తాండ నాకు అర్జంటుగా క్షమాపణ చెప్పాలి. నాకే కాదు. మన తెలుగు బ్లాగర్లందరికీ. తెలుగు బ్లాగర్లకే కాదు. అసలు తెలుగు ప్రజానీకం మొత్తానికీ.

ఎందుకో కాసేపు వేచి చూడండి.

Read more...

Thursday, June 18, 2009

తిండి తిప్పలు: బెక బెకల పక పకలు



Zhang Ziyi (కిమ్ సాంగ్-జు వి కొంచం చిన్న కళ్ళు)

దేవుడా....

స్నేహితునికి కుడా ఈ కష్టం రాకూడదు. (కాస్త ఎక్కువైందా?). చక్కగా పిజ్జాలూ, బర్గర్లూ తింటూ ఏసీ రూముల్లో కూచునే వాడిని. లేదా ఇంట్లోనే అమ్మ చేతి వంట తింటూ ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఈ ఖర్మ పడుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఎక్కడ ఏ స్పెషల్ చూసినా బెక బెకలో, బొవ్ బొవ్ లో, బుస్ బుస్ లో. శాకాహారం మచ్చుకైనా కానరాని ముచ్చు ప్రదేశంలో ఆకలితో అలమటించలేక ఎప్పుడో మానేసిన నాన్-వెజ్ తినాల్సి వచ్చింది.

పొద్దున నిద్ర లేచి నా దగ్గరున్న టీ పొట్లంతో ఏదో కానిచ్చి మళ్ళీ సిటీలో ఉన్న నా హోటల్ రూమ్ కి వెళ్ళాను. ఇంతలో అక్కడ నా పక్క రూం లో ఉన్న ’కిమ్ సాంగ్-జు’ నాకు హాయ్ చెప్పింది. అదేదో బూతులా నాకు వినిపించింది. ఇప్పుడర్ధమైందనుకుంటా నేనెక్కడున్నానో.

నవ్వు ముహం ఎక్కడైనా ఒకటే అని నాకు తెలుసు. (కామన్సెన్స్ ఎక్కువలే) అందుకే అలా ఒక నవ్వు విసిరా. ఆ పిల్ల కూడా చాలా బాగుంటుంది. అచ్చ చీనీ కళయినా కాస్త zhang ziyi లాగా బాగుంది. లాగా అంటే లాగా అని కాదు. కాస్త ఆ కళా ఉందని. క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్ హీరోయిన్! తెలుసు కదా.

టిఫిన్ చేద్దామని చూద్దామా... ఎక్కడ బెక్ బెక్ లు కలుస్తాయో అని భయం. ఏదో అలా సరిపెట్టేదామని కందమూలాదులని బయటకు తీసి కారిడార్ నుంచి రూమ్ లోకి వెళ్ళబోతున్నాను. ఇంతలో ఎలక్కోతుల కిచ కిచలు వినిపించాయి. మధురంగా.

కొంపదీసి కోతులేమన్నా దాడి మొదలెట్టాయా అని నేను (కంగారేం లేదు కానీ నా పరిస్థితి కుంపట్లో మాగిన కుంకుడు కాయ లాగా తయారైంది. మనో వికలత చేత అలా ఉందన్నమాట) వెనక్కి తిరిగేలోపలే నామీద ఒక చెయ్యి పడింది.

"మిస్సియొ డన రజ్జ్ ॓%(ఽ%॑॓%‌%॓॑॑$%%%$##$4," ఇంకేంటొ తెలియని మాటాలు వినిపించాయి.

"యా, వాడ్యు వాన్?" నేనన్నాను. అమ్మా తల్లే కాస్త నువ్వే భాష లో మాట్లాడావో చెప్పు. అని మొత్తుకోబోయి తమాయించుకున్నాను. ఒక అరవై తొమ్మిది సార్లు విన్నాక నాకు అర్ధం ఐందేంటంటే

"Mr. Dhanaraj, today is my birthday, and I'm missing my family and friends. I'm gonna have a special dinner. I want you come. I'm politely inviting you."

సరే కదా ఏదో స్పెషల్ డిన్నర్ కదా అని వెళ్ళబోయా. మనసులో ఏదో ఓమెన్ (Omen) ఫీలింగ్ ఉన్నా ఎటూ నాన్-వెజ్ తిందామనుకున్నా కదా. సమస్య ఏముంది. అంతగా ఇబ్బందైతే ఏ చికెనో స్పెషల్ గా తెప్పించుకోవచ్చు. ఆ పిల్లకిబ్బందైతే మనకి డబ్బుల ప్రాబ్లమేముందనే ధైర్యంతో ముందుకు పోతా ఉన్నా.

"పోవుగాలము వచ్చిన వానికి పోగాలపు బుద్ధులే బుట్టున్."
-మాస్టర్జీ ఉవాచ

దాదాపూ గంట విన్నాక నాకు ఆ చీనీ పిల్ల కిమ్ సాంగ్-జు మాటలు ఏడెనిమిది సార్లకే అర్ధం కా సాగినై (ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ). ఆ చీనీ హాసిని లొడలొడా వాగుతూనే ఉంది. నేను మాత్రం బ్యూటీ బాగుంది కదాని తన కంపనీని (కుంఫణీ వాడదామనుకున్నగానీ ట్రేడు మార్కు సమస్య) ఎంజాయ్ చేస్తూ ఉన్నాను.

ఇంతలో ఎంటర్ ద డ్రాగన్ లాగా ఎంటర్ ద ఫుడ్ ఐటంస్.

"అవేంటి?" అడిగాను. ఐదో సారికే అర్ధం అయింది. "నూడిల్స్ విత్ ఫ్రాగ్ మంచూరియా" అని. మొదటి రోజున తెలియక తిన్నా ఏమీ కాలేదు కదా అని ధైర్యంతో కాస్త వడ్డింపజేసుకుని వీలైనంతలో ఆ ముక్కలని తీసివేసి తిన్నాను. నేను నాకక్కర్లేనివి ఆ పిల్ల పళ్ళెంలోనే వేశాను. అదేదో బంగాళ దుంప వేపుడైనట్లు మహదానందంగా తింటోంది కిమ్ సాంగ్-జు.

తరవాత ఏమి కావాలని అడిగింది. నేను నాన్-వజ్ వద్దు అన్నా. ప్లీజ్ ఇవాళ నా బర్త్ డే. (కొంచంలో తప్పింది కానీ ఆ రోజు నా డెత్ డే అయ్యేది. ఏదో మాస్టర్జీ ఆశీస్సులు). యూ ఆర్డర్ ఎనీ ఐటం . ఐ హావ్ నో ప్రాబ్లం అంది.

సరే నాకు ఆ చైనీస్ అంతగా రాదు. ఎనీ చికెన్ ఐటం చెప్పెయ్ అన్నా. మళ్ళా ఏవో ఎలక్కోతి కిచ కిచలు. కాసేపయ్యాక వచ్చింది. నా మృత్యు దేవత.

ఎలా తిన్నానో తెలియదు. ఏమి తిన్నానో తెలియదు. మొత్తానికీ ఎలాగో కిమ్ సాంగ్-జు మొహం చూస్తూ కానిచ్చాననిపించి తన సహాయంతోనే నా రూమ్ కి వెళ్ళా.

తెల్లారక ముందే నా బతుకు తెల్లారింది. స్టమక్ క్రాంప్స్. పది రోజుల పైన చచ్చాను. ఏదో గంభీరంగా నెట్టుకొచ్చాను కానీ, అమ్మో పగవానికే కాదు. స్నేహితులకి కూడా ఆ కష్టాలు వద్దు.

మూడో రోజున కిమ్ సాంగ్-జు వచ్చి పలకరించింది. ఆ ఎలక్కోతి కిచ కిచ లలో నాకు అర్ధం అయింది ఏమిటంటే, నాకు ఆ రోజు పెట్టింది ’పాము కరచిన చికెన్’. హత విథీ! చీనీ పిల్ల మోజులో పడి ప్రాణం మీదకి తెచ్చుకున్నానా! అని అరికాళ్ళు కొట్టుకుని (తల కొట్టుకుందామనుకుంటే నా మెదడు అరికాల్లోకి వచ్చి తిష్ట వేసుక్కూర్చుని రెండు రోజులు దాటింది)తనని ఏమీ అనలేక ఎదో సర్ది చెప్పి పంపాను.

తను వెళ్తూ వెళ్తూ బాధగా, "$^*((%^%$&^(*^&*%%#$_)( *^&* *&^&^" ఎలక్కోతి కిచ కిచలతో నిష్క్రమించింది.

పదో రోజున మళ్ళా నా రూమ్ లోకి వచ్చి, ఈ సారి రెండో సారికే అర్ధం అయింది. తను హాయ్ అందని, పలకరించింది. నాకు ఇవాళ దశ దిన కర్మలు చేయవచ్చావా అనుకున్నా, గంభీరంగా ఒక నవ్వు నవ్వా. ఎక్కడైనా నవ్వు నవ్వేగా.

చేతిలోంచీ కాస్త కుంకం తీసి నాకిచ్చి (అయ్యో అయ్యో నాకి ఇవ్వటం కాదు. నాకు, అనగా ధనరాజ్ మన్మధ కి) పెట్టుకోమంది. ఎక్కడిదో అడక్కుండానే ఎవరో ఇండియన్స్ కనిపిస్తే దేవుడి దగ్గర పెట్టిన కుంకుమ నాకోసం తెచ్చిందట.

"ఆహా! ఎంత చీమ (ఈ పదం నాది కాదు. చీనీ + ప్రేమ గివ్స్ రైజ్ టు చీమ)" అనుకున్నా.

తర్వాత గత వారం రోజుల్లో బాగా ఫ్రెండ్స్ అయ్యామనుకోండీ. ఇదేనేమో లవ్ ఎట్ బెకెన్ సైట్ అంటే.

మాస్టర్జీకి జరిగింది చెప్తే, "హాయిగా ఈ లైనేదో అరవ పిల్లకేస్తే వడా సాంబార్ దొరికేవి. చీనీయులతో కష్టం," అన్నాడు. నిజమే కదా!

ఇవండీ, నా అరవచీనీ తిండి తిప్పలు.

Read more...

Wednesday, June 17, 2009

ఇలియానా పూర్వ గాధా లహరి: ఎవరే అతగాడు?

Note: This is meant only for fun. Nothing serious. Kindly take them with sportiveness.

Once upon a time there lived a princess called Iliyana (Ileana). ఇది తెలుగు బ్లాగు కనుక ఇక తెలుగులోనే ముందుకు పోదాం.

భవిష్యత్ లో అంటే భూంపుట్టక ముందు ఒకానొక దేశంలో ఇలియానా అనెడి ఒక కన్యోత్తమ కలదు. ఆమె తండ్రి ఒక రాజు కాన ఆమె ఒక రాకుమారి. As usually అందరు రాకుమార్తెలలాగా ఆమెకును ఏరకమైన వ్యాపకం లేనందున ప్రేమ యనెడి వ్యాపకమున బడెను.

ఆ విరహ తాపమున ఆమె విలపించుచుండగా ఆమె చెలికత్తె ఇట్లనెను.

"అమ్మడూ ఇలీ! నీవేదో కడు విషాదమునున్నట్లు తోచుచున్నది. కొంపదీసి ప్రేమలో గానీ పడితివా ఏమి నెచ్చెలీ," అని అడిగెను.

ఇలీ అన్న పిలుపు పిల్లీ లాగ తోచిన ఇలియానా అనెడి ఆ రాకుమార్తె మరింత భోరుమని విలపించగా..... ఆ చెలికత్తె ఇట్లనెను.

"అమ్మా! ఇలియానా దేవీ! నీ మనసునున్న యువకోత్తముండెవరో నాకు చెప్పిన నేను వాని పట్టితెత్తును కదా?"

ఆ విరహతాపమున నోట మాట రాని ఇలియానా అలా తన ట్రేడు మార్కైన వెర్రి చూపు చూచుచుండ... ఆ నెచ్చెలి ఇట్లనియె.

"ఎవరే అతగాడు? ముందుగ మన తెలుగు బ్లాగ్లోకమున వెదికెద సారీ చెప్పెద. వేణు గానమును వినిపించు బ్లాగరా? ఈ మధ్యనే కవిత్వం షురూజేసిన కత్తి మహేషా? హాస్య చక్రవర్తియైన విహారా? ఋష్యమూక పర్వతమున ఆ నలుగురికి దడచి దాగిన రవి గాంచలేని తేజో పరాక్రమశాలి ’రవి గారా’?" ఇట్లు చెప్పుకుని బోతుండగా... ఆ వాక్ప్రవాహానికడ్డుకట్టవేసిన ఇలియానా దేవి ఇట్లనియె.

"ఆఁ రవిగారా?" ఒక చిన్న నవ్వు నవ్వి, "గారెలు తిన్న కాస్త వళ్ళు వచ్చునని ఒక మహాముని నాకు నుడివెను. ఆ రవి గారెనెట్లైనను నాకు జేసి పెట్టమని చెప్పవే నెచ్చెలీ"

"హుష్! నా డవిలాగునకుయడ్డు ’రాకు’మారీ! నన్ను చెప్పనిమ్ము."

"అటులనేగానిమ్ము ప్రియమణీ!"

"పెళ్ళిగాని సీనునని ఎందరినో మభ్యపెట్టి ఈమధ్యనే వివాహమును జేసుకున్న ఒంగోలు సీను ఐన నేనేటియునూ జేయజాల. కెబ్లాస మూల పురుషుడు, మన రౌడన్నా? లేక పల్నాటి గాలినిదప్ప వేరు గాలినైనను సోకనివ్వని భాస్కరరామరాజా? హాహాహాసినియని బొమ్మరిల్లు స్పూఫు వేసిన నాగమురళియా? ఎవ్వరైనను జెప్పుము నేను దెత్తును నీకు, యొక్క ఈటీవీ సుమనును దప్ప."

"పాపం అతగానికేమియైనదే నెచ్చెలీ?"

"రచనా, దర్శకత్వం, మాటలూ, పాటలూ, బొమ్మలూ, దర్శకత్వ పర్యవేక్షణా, కథా, కథనం, పాడేదీ, రాసేదీ, ఆఖరుకు ఏసేదీ, చూసేదీ కూడా తానెయై ఉండు ఆతనిని నీవు వివాహమాడిన, నీకు వేసుకొనుటకు సున్నమైనను మిగల్చక ఊడగొట్టిపంపెదరే జనులు."

"మరి ధనరాజ్ మన్మధుడైన ఎట్లుండును?"

"బాగుండునుగానీ అతను ఆల్రెడీ బుక్డ్ కదా?"

"ఎంతీ!" అని తనదైన శైలిలో ఇలియానా ఆశ్చర్యపోయినది.

"నేను బుక్డ్ కాదు తల్లే. ఆ చీనీ పిల్ల అక్కదివరకే," అని నేను మందలించి నాకు జరగబోవు నష్టమును నివారించి కట్ చెప్పగా, రెండవ సన్నివేశమునకు రంగము సిద్ధమైనది.

***

అతగాడెవరో రేపు ఇలియానా నోటి వెంటే విందుము.

ఆమెన్! (ఆమెను కాదండీ. Amen)



Read more...

Tuesday, June 2, 2009

నేను తెలుసుకున్న సత్యం

లోక హితం కోరటం బాగానే ఉంటుంది. మంచిది. మనకి పరోపకార బుద్ధి ఉండటం... మన అదృష్టమే కావొచ్చు. కానీ అందుకోసం... అదే... మనం ఉపకారం చేయటం కోసం పరులు కష్టాల పాలవ్వాలని కోరుకుంటాం ఎంత వరకూ సబబు?

You can fight against an enemy. But when you are up against a friend, who is very kind, helpful, and a pakkaa humanitarian, it's terrible.

మనని తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలనునే స్నేహితులు మనకొద్దు. మనని మనగా గౌరవించే వాళ్ళే మనకు ముద్దు. స్నేహానికి ప్రాతిపదిక స్వేచ్ఛ. స్నేహం కోసం నిన్ను నువ్వే త్యాగం... ఆ మాట కూడా తప్పు. కోల్పోవటం ఫూలిష్నెస్స్. కొందరు నిన్ను డిక్టేట్ చేయాలనుకుంటారు స్నేహం ముసుగులో. నిన్ను నువ్వు కోల్పోయిన తరువాత ఇక ఆ స్నేహితుడు తన రంగు బయట పెడతాడు.

అయినా ఎంత స్నేహమైనా తనకి చెప్పకుండా నిర్ణయం తీసుకోవద్దనే వాడు ఏమి స్నేహితుడు? నీదైన లోకాన్ని చిద్రం చేయాలనుకునే వాడు ఏమి మిత్రుడు?

నిన్ను అపరాధ భావం లో ముంచెత్తి, నీకూ నీ వాళ్ళకీ మధ్యన అగాధాన్ని సృష్టించేవాడు ఎ రకమైన మిత్రుడు? నిన్ను నీ వాళ్లకు కాకుండా చేసి తన మీద ఒక ఎమోషనల్ ప్యారసైట్ లాగ డిపెండ్ చేసుకుని నిన్ను చులకన కట్టే వాడు ఏమి స్నేహితుడు.

అందుకే "You may be wrong. You may be a fool. You may be a champion. But what always matter is You gotta be free."

మా నాన్నగారిని ఇలాగే చేసి ఆయన ఆత్మ హత్య చేసుకునే లాగా చేసిన ఆయన మిత్రుడు నాకు గుర్తొచ్చాడు. ఆ ఎమోషనే ఈ టపా.

స్నేహితులు లేకుండా ఒంటరిగానైనా ఉండొచ్చు కానీ, ఇలాగ నీఅస్తిత్వాన్ని కోల్పోవటం కన్నా ఆత్మ హత్య చేసుకోడమే మేలని మా నాన్న ఆత్మహత్య నోట్ లో రాశారు. ఇది జరిగి పదేళ్ళు అయింది.

అందుకే "నాదే ఈ ప్రపంచం." నేనే మహారాజుని. నన్ను గౌరవించని వారూనన్ను శత్రువు అనుకునే వారినీ నేను లెక్క చేయను. నీకు ఫ్రెండ్స్ లేరా? అనొచ్చు. నాకు నిజమైన స్నేహితులూ, ఒక గొప్ప గురువూ ఉన్నారు. ఆయినా అమ్ముంటే అంతకన్నా ఏం కావాలి?

ధనరాజ్ మన్మధ

Read more...

త్రిలింగం: వీడికి పోస్టులెక్కువ


ekalingam.blogspot.com

The new Marthanda

Read more...

Monday, June 1, 2009

నేను పుట్టాను. HAPPY BDAY DHANA...

నింగీ, నేలా, ఆకాశం..........................
......................................................
......................................................
......................................................

and DHANARAJ MANMADHA

Wish me a Happy Birthday.

Read more...

Monday, April 13, 2009

Plagiarism అప్పుడే మొదలైంది.


ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది అని ధంకా బజాయించి మరీ చెప్తుంటాం. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం (లిఖిత పూర్వక) అని జబ్బలు చరుస్తాం. కానీ తొడ గొట్టే బాలకృష్ణ డయలాగ్ మర్చి పోయినట్టు "వండుకున్నమ్మకి ఒక్కటే కూర..." సామెతని మాత్రం చాలా కంఫర్టబుల్ గా మర్చిపోతాం.
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం. అవును కానీ అందులో ఒక్కటంటే ఒక్క original అంశాన్ని చూద్దామంటే హైదరాబాద్ లో ఒయాసిస్ కోసం వెతికినట్టు అవుతుంది. అక్కడే మన పెద్దలు Plagiarism is our birth right అని చాటారు.
కొన్ని సూత్రాల్ని అమెరికా నుంచీ, మరి కొన్నింటిని జర్మనీ నుంచీ, ఇంకొన్నింటిని దక్షిణాఫ్రికా నుంచీ, ఆస్ట్రేలియా, ... వగైరహ్ లైన దేశోత్తమాల నుంచీ ఎత్తుకొచ్చి అలా మన ప్రజానీకానికి 'మన'వి చేసుకున్నారు.
అలా మన పెద్దలు మనవి చేసుకోవటం చూపగానే మన ప్రజానీకం నాయకుల ఆదర్శ బుడుంగు జాడలలో నడిచి ఆల్ మనవి చేసుకోవటాన్ని అలా అలా కొనసాగించారు.
అక్కడ మొదలైన plagiarism ఇప్పటికీ కొనసా............గి జనం లో ఇంకి, పెంకి, అన్నిటినీ శంకి మనలను డాంకీ, అలా అలా నడిచి పోతున్నది.
అంత పెద్ద భారత దేశమే మనవి చేసుకుంటుంటే చూస్తూ ఉన్న మనం ఎవరో పాపం బ్లాగుల్లో ఏదో పెట్టుకున్నారని దుమ్మెత్తి పోయటం ఏమి న్యాయం?

Read more...

అంబేద్కర్ అమర్ రహే.


భీం రావ్ రాంజీ అంబేద్కర్. కొందరిలో విద్వేషం, మరికొందరిలో గౌరవ భావాన్నీ రగిల్చే వ్యక్తి. భారత దేశంలో అత్యున్నత నాయకుల్లో ఒకడిగా, నిమ్న కులాలని పైకి తీసుకుని రావాలనే ధ్యేయంతో జీవితకాల కృషిని చేసిన వ్యక్తిగా, ఉన్నత విద్యావంతునిగా, భారత దేశానికి రాజ్యాంగాన్ని సమకూర్చిన వ్యక్తిగా ఈయనను ఎవరూ మర్చిపోలేరు.


ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనని స్మరించుకుందాం.

Read more...

కులం కుల:

"కులాలు నశించాలి!"


కుల రహిత సమాజం వర్ధిల్లాలి!


కులాల్ని నిర్మూలిస్తాం.


సామాజిక అసమానత్వాన్ని నిరశిస్తాం.


కానీ మా కులపోళ్ళకే ఎక్కువ సీట్లిస్తాం. "అరేయ్! మన కులపొడేరా! వదిలేద్దాం.


మనం దేన్ని వదిలేయాలో దాన్నే ఎక్కువ పట్టుకుని వేళాడుతాం. "అంటరానితనం అమానుషం." కానీ ఈ మటలని చిన్నప్పుడు బళ్ళో చెప్పిన అయ్యోరే తన ఇంటికి అంటరాని పిల్లలని రానీరు. రానిస్తే అంటు సోకుతుందని భయం.
మరి పాఠాలని ఎందుకు అలా చెప్తారు?ఈ దొంగ మాటలెందుకు?

సామాజిక న్యాయం = టిక్కెట్లమ్ముకోవటం.

అభివృద్ధి = అవినీతి లో దూసుకెళ్ళటం .

ఆత్మగౌరవం = కాలంలో వెనుకకి వెళ్ళటం.


ప్రత్యేక రాష్ట్రం = ఇది మా యాస అంటూ ప్రతీదానికీ బండబూతులు తిట్టటం.

ప్రజాపోరాటం = జనం వెనకుండి వారు పోరాడి దెబ్బలు తింటే మనం వారికోసం గొంతు విప్పి పాట పాడి నాట్యం చేయటం.

ఇన్ని చేసినా 'వాడు మన కులపోడురా!" ఇది మాత్రం మానం. మనం. మానం లేని మనం.

Read more...

Sunday, August 31, 2008

థాంక్స్!

Thank you for the persons who gave me the information about the blogs I asked for.

"ఈ ప్రపంచంలో రెండు విషయాలే సత్యం. ఒకటి గెలవటం. రెండు ఓడిపోవటం. అంతే. మిగతా అంతా మాయే. ఎందుకంటే విజేతలని అందరూ జ్ఞాపకం ఉంచుకుంటారు. పరాజితులని అందరూ మర్చి పోతారు. అందుకే విజయం శాశ్వతం. విజేతే అమరత్వానికి అర్హుడు."Start where you are. Use what you have. Do what you can. Then only you are you. Or you are not you Then there will be nothing to be glorified about you because, your story can be told, but the name won't be yours." THE STORY OF A BUNCH OF CHAMPIONS IN A VILLAGE CALLED WIMBLEDON."

అంటూ గీతాచార్య గారు ఒక మంచి బ్లాగ్ రాస్తున్నారు. ఆ బ్లాగ్ పేరు "వింబుల్డన్ విలేజ్". లింక్

http://wimbledonweekly.blogspot.com/


కల్హార
Myriad of musings ని కూడా చూశాను. చాలా మంచి బ్లాగ్ అది. ఎందుకో రీసెంట్ గా అందులో పోస్ట్స్ లేవు మరి.

Any way, I'll start my own blogs soon.

Bye to all.

ధనరాజ్ మన్మధ.

Read more...

Thursday, August 28, 2008

ఎస్. ఈ ప్రపంచం నాదే!

"If you say yes to anything, it will be yours."

The Fountainhead లోని హీరో dialogue.

మరి నేనూ అంతే . ఈ ప్రపంచానికీ, ఈ లోకానికీ, "Yesss!" అందుకే ఈ ప్రపంచం నాదే. దేనికైనా భయ పడుతూ కూచుంటే అది మనకి మరణం తో సమానం అని వివేకానంద చెప్పారు. సో, "నో టు ఫియర్. ఎస్ టు ది లైఫ్."

మళ్ళీ కలుద్దాం. ఇప్పటికే ఎక్కువ అయింది. మంచి sports blogs, కవితల బ్లాగులగురించి ఎవరైనా చెపుతారా?

ధనరాజ్ మన్మధ.

Read more...

About This Blog

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP